- స్పామర్లు మరియు స్కామర్ల నుంచి వినియోగదారుల గుర్తింపును కాపాడుతుంది. - భారతదేశపు మొట్టమొదటి 10 అంకెల సిమ్‌ఉఫ్రీ మొబైల్ నెంబర్
హైదరాబాద్/బెంగళూరు: మన మొబైల్ నెంబర్లు ఇప్పుడు అసంఖ్యాక బహిరంగ ప్రదేశాలతో పాటుగా ఆన్‌లైన్, అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆచరణాత్మకంగా మనకు అందుబాటులో లేని అనేకమంది అపరిచితులు సైతం వీటిని పొందుతున్నారు. ఈ కారణం చేతనే, మనం ఎలాంటి అవకాశం లేక ఏదో ఒక సమయంలో మన మొబైల్ నెంబర్‌ను ఇతరులతో పంచుకుంటుంటాం. ఇప్పుడు, ఈ చిన్న ప్రక్రియ యొక్క పరిణామాలు భయంకరంగా ఉంటున్నాయి.అసంఖ్యాక స్పామ్ కాల్స్ మరియు సందేశాలు, ఏకధాటిగా స్కామ్, ఫిషింగ్ మరియు మోసం చేయడానికి ప్రయత్నాలు బీ అపరిచితుల నుంచి ఏకధాటిగా వేధింపులు, బ్రాండ్ల నుంచి స్థిరంగా గోప్యతకు భంగం వాటిల్లడం జరుగుతున్నాయి.
మొబైల్ వినియోగదారుల డిజిటల్ గుర్తింపును కాపాడే ప్రయత్నంలో, హైదరాబాద్ కేంద్రంగా కలిగిన టెన్20ఇన్ఫోమీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు దూస్రాకు రూపకల్పన చేసి అభివృద్ధి చేసింది. మొట్టమొదటి, వినూత్నమైన పరిష్కారంగా, దూస్రా ఓ 10 అంకెల డిజిట్, సిమ్‌ఉఫ్రీ మొబైల్ నెంబర్. దీనిని వినియోగదారులు ఎక్కడైనా పంచుకోవచ్చు. మరీముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ సహా తమ వ్యక్తిగత మొబైల్ నెంబర్‌ను పంచుకోవడానికి ఇబ్బంది పడే ప్రతి చోటా దీనిని పంచుకోవచ్చు. దూస్రా నెంబర్‌కు వచ్చే అన్ని ఇన్‌కమింగ్ కాల్స్, స్వయంచాలకంగా బ్లాక్ చేయబడటమో లేదంటే వాయిస్ మెయిల్‌కు పంపడమో లేదంటే, దూస్రాపై వినియోగదారుల ప్రాధాన్యత మరియు సెట్టింగ్స్ ఆధారంగా పనిచేయడం చేస్తుంది. అన్ని ఇన్‌కమింగ్ సందేశాలనూ నిశ్శబ్దంగా దూస్రా యాప్‌పైఉన్న మెస్సేస్ ఫోల్డర్‌లో ఉంచడంతో పాటుగా వాటిని విశ్రాంత సమయంలో సమీక్షించవచ్చు. ఇది వినియోగదారులకు తమ డిజిటల్ గోప్యత నియంత్రించుకునే అవకాశం కల్పించడంతో పాటుగా స్కామర్లు మరియు స్పామర్లు నుంచి తమ గుర్తింపును కాపాడుకునే అవకాశమూ కల్పిస్తుంది. అదృష్టవశాత్తు, దూస్రా యాప్‌కు యూజర్స్ ఫోన్ కాల్ లాగ్స్, ఫోన్ బుక్, ఫోటోగ్యాలరీ లేదా ఫోన్‌లో నిక్షిప్తం చేసిన మరేదైనా సమాచారానికి యాక్సెస్‌ను ఇతర తృతీయ పక్ష యాప్‌లలా అందించాల్సిన అవసరం లేదు. దూస్రాను తెలంగాణా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక వ్యవహారాలు మరియు నగరాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ కె.టీ.రామారావు ఆవిష్కరించారు.
ఈ ఆవిష్కరణ సందర్భంగా శ్రీ కె టీ రామారావు మాట్లాడుతూ పూర్తి వైవిధ్యమైన ఉత్పత్తిగా దూస్రా నిలువడమే కాదు దీనికి వృద్ధి చెందేందుకు అపార అవకాశాలు కూడా ఉన్నాయి అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ స్పామింగ్‌కు తాను కూడా బాధితుడినే అంటూ దూస్రా తనకు చక్కటి సహాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. నేటి నుంచే తాను దూస్రాను వినియోగించబోతున్నానన్నారు. స్పామ్ కాల్స్‌ను అడ్డుకోవడంలో ప్రభావవంతమైన పరిష్కారంగా దూస్రా నిలుస్తుందని భావిస్తున్నానంటూ మరీ ముఖ్యంగా మహిళలు దీనిద్వారా ప్రయోజనం పొందగలరని అభిప్రాయపడ్డారు.
ఈ ఆవిష్కరణ గురించి శ్రీ ఆదిత్య వుచి, ఫౌండర్ అండ్ సీఈవోఉదూస్రా మాట్లాడతూ 'ప్రస్తుతం, మన వ్యక్తిగత మొబైల్ నెంబర్‌తో మన ప్రతి వ్యక్తిగత వివరమూ అంటే బ్యాంక్ ఖాతాలు, పేరు మరియు చిరునామా, సోషల్‌మీడియా ప్రొఫైల్స్, ఈఉమెయిల్ చిరునామాలు, మనం ఉన్న ప్రాంతం, పనిచేసే వివరాలు, వ్యక్తిగత కాంటాక్ట్స్, ముఖ్యమైన ఐడీ కార్డులు మరియు మరెన్నో అనుసంధానితమై ఉంటున్నాయి. ఒకవేళ ఈ మొబైల్ నెంబర్ ఏదైనా పబ్లిక్‌డొమైన్‌లో సర్క్యులేట్ అయితే, అది మన గుర్తింపును బహిరంగ పరచడంతో పాటుగా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయి. సృజనాత్మకమే అయినప్పటికీ అతి సరళమైన పరిష్కారాన్ని దూస్రా అందిస్తుంది. ఇది వర్ట్యువల్ మొబైల్ నెంబర్. దీనిని ఎక్కడైనా మరియు ఎవరితో అయినా పంచుకోవచ్చు. వ్యక్తిగత మొబైల్ నెంబర్‌ను పంచుకోవాల్సిన అవసరం లేకపోవడం చేత స్పామ్, అపరిచిత కాల్స్, సర్క్యులేషన్ మరియు వ్యక్తిగత సమాచారం దొంగిలించడాన్ని నివారించవచ్చు. గోప్యత అనేది ప్రాథమిక హక్కు. ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లో కూడా బెదిరింపులకు గురయ్యే ఈ డిజిటల్ యుగంలో మీ డిజిటల్ గుర్తింపును కాపాడటాన్ని దూస్రా లక్ష్యంగా చేసుకుంది.' అని అన్నారు.
ఆదిత్య వుచి, ఓ సీరియల్ వ్యాపారవేత్త. సాంకేతిక సేవల రంగంలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ఆయన, అన్ని వాణిజ్య లావాదేవీలకూ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా మారిందని గుర్తించారు. అంతేకాదు, పలు సేవలను పొందాలంటే వ్యక్తిగత నెంబర్‌ను పంచుకోవడమూ తప్పనిసరి అయింది. స్పామ్ కాల్స్ మరియు చికాకు తెప్పించే ఎస్‌ఎంఎస్‌లు రోజువారీ జీవితంలో విస్తరించిన వేళ, ఆదిత్య వుచి మరియు అతని బృందం ఈ సమస్యకు సంపూర్ణమైన పరిష్కారాన్ని కనుగొంది.
దూస్రా ఏ విధంగా పనిచేస్తుంది ?
సరళంగా చెప్పాలంటే, అన్ని అవాంఛిత కాల్స్‌నూ దూస్రా యాప్‌పై ఉన్న వినియోగదారులకు అనుకూలమైన స్మార్ట్ కాల్ ఫిల్టర్‌తో అడ్డుకోవచ్చు మరియు వినియోగదారులకు ఇది తమ ఫోన్లకు ఎలాంటి కాల్స్ చేరుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. దూస్రా యాప్‌తో, మీరు అపరిచిత కాల్స్‌కు ఫోన్‌చేసే అవకాశం ఉంది. తద్వారా మీ వ్యక్తిగత నెంబర్‌ను ఎక్కడా బహిర్గత పరచలేదన్న భరోసా కలుగుతుంది. సురక్షితమైన సర్వర్ల కారణంగా, గ్రహీత యొక్క స్ర్కీన్ సిస్టమ్ నిర్ధేశించిన ర్యాండమ్ 10 డిజిట్ నెంబర్‌ను అందిస్తుంది.
ఒకరు తమ దూస్రా నెంబర్‌ను ఎక్కడైనా మరియు ఎవరితో అయినా అంటే అపరిచిత వ్యక్తులు మొదలు బంధువులు నుంచి ఆన్‌లైన్ సేవల వరకూ పంచుకోవచ్చు. ఒకవేళ మీ దూస్రా నెంబర్ కలిగిన వ్యక్తులలో మీరు నిర్థిష్టమైన కాలర్ నుంచి కాల్స్ అందుకోవాలనుకుంటే మీరు ఆ కాలర్‌ను నమ్మకమైన కాంటాక్ట్‌గా జోడించుకుంటే వారి కాల్స్‌ను బ్లాక్ చేయదు. ఒకవేళ కాలర్ అతి ముఖ్యమైన సందేశాన్ని పంపాలనుకుంటే, వారు దూస్రా నెంబర్‌పై వాయిస్‌మెయిల్‌ను సైతం పంపవచ్చు. దానిని ఏ సమయంలో అయినా పొందవచ్చు. అన్ని సందేశాలకూ ప్రత్యేకంగా ఇన్‌బాక్స్ ఉంటుంది. ఇది మీ దూస్రా నెంబర్ అవసరాలను తీరుస్తుంది. దూస్రా అనేది నగదుకు తగ్గ విలువను అందించే సబ్‌స్ర్కిప్షన్ ఆధారిత సేవ. పరిచయ ఆఫర్‌గా కంపెనీ , వినియోగదారులకు అత్యంత అనుకూలమైన ధరలను నిర్ణయించింది. తద్వారా మరింత మంది ప్రజలు పూర్తి గోప్యతను పొందడంతో పాటుగా డిజిటల్‌గా పూర్తి భద్రతనూ పొందగలరు.