హైదరాబాద్: జీకె అనే పదం సాధారణ మేథస్సుతో గట్టిగా ముడిపడి ఉంది. అందువల్ల మన జీవితంలో జరిగే విషయాల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఒలింపియాడ్ లాంటి పరీక్షలలో పాల్గొనడం వల్ల విద్యార్థులు దీనిని క్విజ్‌లు, పజిల్స్ ద్వారా అభ్యసిస్తారు. తద్వారా వారు తమ జీవితంలో మరింత నిర్ణయాత్మకంగా మరియు ఆత్మవిశ్వాసంతో కూడి ఉంటారు. నూతన మైలురాయి చేరుకోవాలనుకునే ప్రతి తల్లిదండ్రులు, చిన్నారుల యొక్క కోర్కెలకు మద్దతునందించడంతో పాటుగా అతను లేదా ఆమె చేస్తున్న అంశంలో విజయం సాధించడంలో తోడ్పడటానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తోన్న బహుళ వేదికల జ్ఞాన కార్యక్రమం మైండ్ వార్స్, భారతదేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ జనరల్ నాలెడ్జ్ ఒలింపియాడ్ 2020ను ప్రకటించింది. దీనిద్వారా అత్యుత్తమ రేపటిని చేరుకునే దిశగా విద్యార్థులను గుర్తించడం, ప్రోత్సహించడం మరియు ప్రమోట్ చేయడం లక్ష్యంగా చేసుకుంది.
జాతీయ స్థాయి చాంఫియన్‌షిప్ నవంబర్ 2020న ప్రారంభం కానుంది. ఇది నాల్గవ తరగతి విద్యార్థులు మొదలు 12 వ తరగతి విద్యార్థుల వరకూ భారతదేశ వ్యాప్తంగా అన్ని విద్యా బోర్డ్స్ విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. దాదాపు 20 నిమిషాల పాటు జరిగే ఈ పరీక్షలో సంబంధిత మరియు ఆసక్తికరమైన సాధారణ అవగాహన ప్రశ్నలు తరగతికి 5 అంశాల పట్ల ఉంటాయి. తద్వారా రాబోయే సంవత్సరాలలో విద్యార్థుల సామర్థ్యం, వృద్ధిని లక్ష్యంగా చేసుకున్నారు. అంతేకాదు, దీనిని భారతదేశ వ్యాప్తంగా 5వేలకు పైగా పాఠశాలల్లోని ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులను సవివరంగా సర్వే చేసి సూత్రీకరించారు.ఈ ఒలింపియాడ్ కోసం విద్యార్థులు 24 గంటలూ పాల్గొనవచ్చు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జాతీయ చాంఫియన్‌గా గుర్తింపు రావడంతో పాటుగా ఒక కోటి రూపాయల వరకూ బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది.
వివరాల కోసం https://www.mindwars.co.in/olympiad చూడండి.
పరీక్ష తేదీలు:
నవంబర్ 22, 28 మరియు 29 నవంబర్2020
డిసెంబర్ 5, 6 మరియు 12 డిసెంబర్ 2020
ఈ ఒలింపియాడ్ 2020 గురించి ఉమేష్ కెఆర్ బన్సాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘జాతీయ స్థాయి జీకె ఒలింపియాడ్‌ను నాలెడ్జ్, రీజనింగ్, పోటీతత్త్వం నిర్మించుకోవడం ప్రోత్సహించే రీతిలో నిర్మించారు. ఇది కేవలం పాఠశాల విద్యార్థులు తమ సమస్యా పూరణ నైపుణ్యం వృద్ధి చేసుకోవడంలో సహాయపడటంతో పాటుగా టైమ్ మేనేజ్‌మెంట్ చేయడంలోనూ సహాయపడుతుంది. అదే రీతిలో పోటీతత్త్వపు అనుభవాలను అందించడం వల్ల తమ కెరీర్ ప్రాధాన్యతలను ఎంచుకోవడంలోనూ సహాయపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము విజయవంతమైన విద్యార్థులను బహుళ దశలలో గుర్తించడంతో పాటుగా పాఠశాల స్థాయి, రాష్ట్ర స్థాయిలో బహుమతులను అందించనున్నాం. ప్రతిష్టాత్మక మైండ్ వార్స్ నేషనల్ టాప్ 100 మెరిట్ జాబితాను ప్రతి గ్రేడ్‌లోనూ ప్రత్యేకంగా రూపొందించనున్నాం. ఆన్‌లైన్‌లో అపరిమిత ప్రాక్టీస్ చేయడంతో పాటుగా పలుమార్లు ప్రయత్నించే అవకాశాలు ఉండటం వల్ల చిన్నారులు జాతీయ స్థాయిలో చాంఫియన్‌గా నిలువడంతో పాటుగా జాతికి గర్వకారణంగానూ నిలువవచ్చు’’అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Sep,2020 04:58PM