హైదరాబాద్ : భారత దేశంలో 10 రాష్ట్రాలకు చెందిన 160 మంది నేత్ర సంరక్షణ నిపుణులకు శిక్షణ ఇచ్చే ప్రాజెక్టు కోసం తన ఫ్లయింగ్ కంటి ఆసుపత్రిని వర్చువల్ విధానంలో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు బోయింగ్‌తో కలిసి పని చేస్తున్నట్లు ఆర్బిస్ నేడు ప్రకటించింది. కంటి సంరక్షణ వృత్తినిపుణులకు శిక్షణ, నియంత్రించగలిగిన అంధత్వంపై పోరాటం చేసే స్థానిక భాగస్వాములతో కలిసి గత 20 ఏళ్లుగా భారతదేశంలో తన సేవలను అందిస్తున్న ఆర్బిస్‌కు ఈ ప్రకటన ఒక కీలక మైలురాయి.
ప్రపంచంలో ఎమ్‌డి-10 విమానంలో నిర్వహించే ఏకైక, పూర్తి స్థాయి ఆఫ్తాల్మిక్ బోధన ఆసుపత్రిగా గుర్తింపు పొందిన ఆర్బిస్ ఫ్లయింగ్ ఐ హాస్పిటల్ 1988 నుంచి భారతదేశానికి వస్తుండగా, ఈ ఏడాది ఢిల్లీలో తన 19వ సందర్శన కోసం రానుంది. కొవిడ్-19 కారణంగా, ఆర్బిస్ తన ఫ్లయింగ్ ఐ హాస్పిటల్‌లో శిక్షణను కేవలం వర్చువల్ విధానానికే పరిమితం చేసి, దేశ వ్యాప్తంగా ఉన్న నేత్ర సంరక్షణ నిపుణులకు, 10 దేశాలకు చెందిన ఆర్బిస్ వాలంటీర్ ఫ్యాకల్టీ (వైద్య నిపుణులు) మరియు ఆర్బిస్ సిబ్బందితో శిక్షణ హామీని అందిస్తోంది. మొత్తం మీద ఇందులో, 15 ఆర్బిస్ భాగస్వామ్య సంస్థలు ఉండగా, అందులో న్యూ ఢిల్లీలోని డా. ష్రాఫ్స్ ఛారిటీ ఐ హాస్పిటల్ కూడా ఉంది.
‘‘మనం అందరం వేసుకున్న ప్రణాళికలను 2020 ఏడాది పూర్తిగా తారుమారు చేసింది, కానీ, రోగికి నాణ్యమైన నేత్ర సంరక్షణను అందించేందుకు కంటి సంరక్షణ నిపుణులకు అవసరమైన శిక్షణను, సురక్షితంగా పొందగలిగేలా చూడవలసిన అవసరం ఉందని’’ ఆర్బిస్ ఇండియా కంట్రీ డైరెక్టర్ డా.రిషి రాజ్ బోరా పేర్కొన్నారు. ‘‘బోయింగ్ భాగస్వామ్యం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది మరియు ఈ వర్చువల్ ప్రాజెక్ట్‌కు కంపెనీ మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ఒకే రకమైన ఆలోచనలు కలిగిన రెండు సంస్థలు, మార్పుకు కట్టుబడి ఉన్నప్పుడు ఏమి సాధించవచ్చో తెలియజేసేందుకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ’’ అని పేర్కొన్నారు.
‘‘నియంత్రించగలిన అంధత్వానికి చికిత్సలు అందించంలో ఆర్బిస్ నిబద్ధత స్ఫూర్తిదాయకం. ఆరోగ్య రంగానికి చెందిన వారికి నైపుణ్యం మరియు విద్య వంటి అదనపు కార్యక్రమాల ద్వారా, బోయింగ్ కంపెనీ 300,000 మందికి పైచిలుకు జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. భారతదేశంలోని స్థానిక సముదాయాలకు దీర్ఘకాలికంగా స్థిరమైన కంటి సంరక్షణను అందించేందుకు భారతదేశంలోని కంటి సంరక్షణ నిపుణులను ముందుకు తీసుకువచ్చి వారికి దీర్ఘకాలికంగా కంటి సంరక్షణకు సంబంధించి మార్గదర్శనం, శిక్షణ మరియు స్ఫూర్తిని అందించడం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మానవుల పరిస్థితులను మెరుగుపరచేందుకు వారు చేస్తున్న శ్రమకు మద్దతుగా నిలవడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని’’ బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తే అన్నారు.
ఆర్బిస్ వర్చువల్ ఫ్లయింగ్ ఐ హాస్పిటల్ ప్రాజెక్ట్‌ను అవార్డు గెలుచుకున్న టెలిమెడిసిన్ ప్లాట్‌ఫారం Cybersight ద్వారా నిర్వహించబడుతోంది. నేత్ర సంరక్షణ నిపుణులు దిగువ పేర్కొన్న విభాగాల్లో తమ పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఆర్బిస్ టైలర్ మేడ్ కోర్సులను అందిస్తోంది: మధుమేహంతో బాధపడే వారిలో కంటి వ్యాధి, కంటి శుక్లానికి శస్త్ర చికిత్స, ఆప్తాల్మిక్ నర్సింగ్ మరియు బయోమెడికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన వైద్య రెటీనా విధానాలు. ఇందులో పాల్గొంటున్న వారిలో- నేత్ర వైద్యులు మరియు నివాసితులు, నర్సులు మరియు బయోమెడికల్ ఇంజనీర్లు మరియు సాంకేతిక నిపుణులు ఉండగా- ప్రీ-లెర్నింగ్ మాడ్యూల్స్, రికార్డ్ చేసిన ఉపన్యాసాలు మరియు ప్రత్యక్ష ఉపన్యాసాలు & చర్చా గోష్ఠులు శిక్షణలో భాగంగా ఉంటాయి.
ఆ ఆవిష్కారాత్మక నమూనా కాటరాక్ట్ కోర్సులో రిమోట్ సిమ్యులేషన్ శిక్షణ ఉంటుంది. దీనితో శిక్షణలో పాల్గొనే వారు, రోగులకు ప్రత్యక్షంగా శస్త్ర చికిత్స చేసేందుకు ముందుగానే కృత్రిమ నేత్రాలపై నైపుణ్యంతో శస్త్ర చికిత్స చేసి తమ నైపుణ్యంతో చికిత్స విధానాలను మెరుగుపరచుకునేందుకు అవకాశం ఉంటుంది. వారి అభ్యాసానికి సంబంధించిన వీడియోలను రికార్డ్ చేయడం, అప్‌లోడ్ చేయడం ద్వారా, శిక్షణలో పాల్గొనే వారు ఆర్బిస్ వాలంటీర్ ఫ్యాకల్టీ నుంచి మూల్యాంకనం, అభిప్రాయాలను అందుకుంటారు.
భారతదేశంలో అంధత్వానికి కంటిశుక్లం ప్రధాన కారణం అవుతోంది మరియు కంటి శుక్లాన్ని తొలగించుకునేందుకు చేయించుకునే శస్త్ర చికిత్స వైఫల్యంతో వచ్చే సమస్యలు మూడో- ప్రధాన కారణంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ మెరుగైన శిక్షణ అత్యవసరం. రోగులకు నేరుగా చికిత్స, శస్త్ర చికిత్స చేసేందుకు ముందు సర్జన్లు తమ నైపుణ్యాలను సురక్షితంగా మెరుగు పరచుకునే అవకాశం ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో జరిగేందుకు అవకాశం ఉన్న ప్రమాదాలను తగ్గించేందుకు మరియు సురక్షితమైన శస్త్రచికిత్సలను ప్రోత్సహించేందుకు సిమ్యులేషన్ శిక్షణ సహకరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నేత్ర చికిత్సల నిపుణులకు ఇస్తున్న సిమ్యులేషన్ శిక్షణ విధానం విస్తృతంగా గుర్తింపు పొందినప్పటికీ, భారతదేశంలో కంటి నిపుణులకు శిక్షణ ఇచ్చే అనుకరణ విస్తృతంగా ప్రాచుర్యం పొందినప్పటికీ, భారతదేశంలో ఉన్న వారికి అది ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Nov,2020 03:05PM