హైదరాబాద్ : ఈ రోజు (సోమవారం) నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా నాగచైతన్య తాజాగా నటిస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రం నుండి పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ పోస్టర్ లో బనీను, లుంగీ వేసుకుని పక్కింటబ్బాయి గెటప్‌లో నాగచైతన్య ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సాయిపల్లవి ఈ పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm