హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడకు చెందిన భర్త నాగేంద్ర కుమార్ రెండో పెళ్ళి చేసుకున్నాడనే మనస్తాపంతో భార్య తన కుమార్తెలు, కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను సంగిశెట్టి కృష్ణవేణి(55), భూపతి శివపావని (27) నిషాన్ (9), రితికా (7)గా గుర్తించారు. ఘటనతో రాజమండ్రి ఉలిక్కిపడింది. అంబేద్కర్ నగర్ రామాలయం వీధిలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm