హైదరాబాద్ : కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణలో సినిమా హాళ్లు తెరుచుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే, థియేటర్లు పునఃప్రారంభించే విషయంలో కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు, ఎంటర్టయిన్ మెంట్ పార్కులు, ఇతర వినోద ప్రదేశాలు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో తెరుచుకోవచ్చని, అయితే, కంటైన్మెంట్ జోన్లలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల యాజమాన్యాలు తీసుకోవాల్సిన చర్యలను కూడా తన ఆదేశాల్లో వివరించింది.
Mon Jan 19, 2015 06:51 pm