హైదరాబాద్ : బిగ్‌బాస్ నాల్గో సీజన్ పన్నెండో వారం నామినేషన్ విచిత్రంగా పెట్టారు. ఈ నామినేషన్ లో ఓ ట్విస్టు ఉంది.. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఓట్ల ఆధారంగా కాకుండా ప్రత్యేక టాస్క్ ద్వారా నామినేషన్ నిర్వహించారు. అందులో భాగంగా బజర్ మోగగానే కెప్టెన్ హారిక మినహా మిగతా ఇంటి సభ్యులు బయట ఉన్న టోపీలను ధరించారు. అందులో ఎరుపు రంగు టోపీ ధరించిన అవినాష్, అభిజిత్, అఖిల్, అరియానా నేరుగా నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ తెలిపాడు. కానీ వారు సేవ్ అయ్యేందుకు ఓ అవకాశం కల్పించాడు. బయట ఉన్న సభ్యుల్లో ఒకరితో స్వాప్ చేసుకోవచ్చని సూచించాడు. దీంతో అవినాష్ మోనల్ తో నీకన్నా 100 కాదు 200% ఈ షోకు నేను అర్హుడిని అని అవినాష్ చెప్పగా.. అలాంటప్పుడు భయమెందుకు, నామినేషన్‌లో ఉండు అని మోనాల్ కౌంటరిచ్చింది. ఇక అఖిల్.. నాకు చాలా సపోర్ట్ చేస్తున్నావు అని అంతా అనుకుంటున్నారు. ఎప్పుడు చేశావు? అని ప్రశ్నించాడు. దీంతో మోనాల్.. అది చేశాను, ఇది చేశాను అని నేను చెప్పను. నువ్వు నా కోసం చాలా మంచి చేశావు అంటూ దండం పెట్టేసింది. ఇక చివర్లో మాత్రం మోనాల్ అందరికీ దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది. మోనల్ అభిజిత్‌తో స్వాప్ చేసుకుంటూ అతన్ని సేవ్ చేస్తూ నామినేషన్‌లోకి వెళ్లినట్లు చూపించారు. అయితే మోనాల్ అభి కోసం నామినేషన్‌లోకి వెళ్లిందా? లేదా హారిక కెప్టెన్సీ పవర్‌తో అభిని సేవ్ చేసి మోనాల్‌ను నామినేషన్‌లోకి పంపించిందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఈ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm