హైదరాబాద్ : ఓట్ల కోసం బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో కల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకే కాదు ఏపీకి కూడా బీజేపీ చేసింది శూన్యమని కేటీఆర్ అన్నారు. ఏపీ రాజధాని అమరావతికి బీజేపీ ఏమీ ఇవ్వలేదని చెప్పారు. అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధాని మోడీ ఎన్నో మాట్లాడారని... చివరకు అమరావతికి నీళ్లు, మట్టి మాత్రమే ఇచ్చారని విమర్శించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే హైదరాబాద్ కు లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని సవాల్ విసిరారు. లక్ష కోట్ల ప్యాకేజీని తీసుకొస్తే మోడీని తాము కూడా ప్రశంసిస్తామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm