హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మండలం తాండ్ర గేట్ వద్ద గణేష్ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు 25 వేల క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది.
Mon Jan 19, 2015 06:51 pm