హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం) ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయని, సీపీఐ 17 డివిజన్లలో పోటీ చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఆగమేఘాలపై నిర్వహించడం, ప్రచారానికి కేవలం వారం రోజుల సమయమే ఉండటం విచారకరమన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సామాన్యులు, డబ్బులు లేని వారు పోటీ చేసే పరిస్థితులు చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారీ వరదలు, వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లితే, కేంద్రం సాయం ఎందుకు అందించలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు సమాధానం చెప్పాలన్నారు. బాధితులతో బీజేపీ బురద రాజకీయాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంటనే కేంద్రం తగిన సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm