హైదరాబాద్ : ఏపీ సీఎస్ నీలం సాహ్నికి మరో లేఖ రాశారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. హైకోర్టు తీర్పు కాపీని లేఖకు జతచేసి నిమ్మగడ్డ పంపారు. రాజ్యాంగ బద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని లేఖలో గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణ, కమిషన్ విధి నిర్వహణలో ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని తీర్పులో న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఇదే విషయాన్ని తన లేఖలో ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm