హైదరాబాద్ : ఎంసెట్ అగ్రికల్చర్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించిన జి.చైతన్య సింధు ఇవాళ తన కుటుంబ సభ్యులతో సీఎం జగన్ ను కలిసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన చైతన్య సింధును సీఎం జగన్ మనస్ఫూర్తిగా అభినందించారు. ఉన్నత విద్య పూర్తయిన తర్వాత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. చైతన్య సింధు నీట్ లోనూ ఏపీ టాపర్ గా నిలిచింది. ఆమె స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. తండ్రి జి.కోటేశ్వరప్రసాద్, తల్లి సుధారాణి ఇద్దరూ డాక్టర్లే.
Mon Jan 19, 2015 06:51 pm