హైదరాబాద్ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా నేడు తిరుమల పర్యటనకు రానున్నారు. ఈరోజు ఉదయం 10.40గంటలకు ఆయన తిరుమల చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇక రాష్ట్రపతి పర్యటనలో విధులు నిర్వర్తించే వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రపతి రాక సందర్భంగా భద్రతా చర్యలు, వసతి సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్‌లు రేణిగుంట ఎయిర్‌పోర్టులో స్వాగతం పలకనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm