హైదరాబాద్ : ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం మొత్తం 37,307 కరోనా టెస్టులు చేయగా, వాటిలో 4,454 పాజిటివ్‌గా తేలింది. ఇక వరుసగా నాలుగవ రోజు కూడా కరోనా మృతుల సంఖ్య 100 దాటింది. గడచిన 24 గంటల్లో 121 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 8,512 దాటింది. ఇప్పటివరకూ ఢిల్లీలో కరోనా నుంచి మొత్తం 4,88,476 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 37,327 యాక్టివ్ కేసులు ఉన్నాయి
Mon Jan 19, 2015 06:51 pm