హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా నగరంలో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను డీటీఎఫ్ అధికారులు అరెస్ట్ చేసారు. నిందితులు యెమెన్, బెంగళూరు, ధూల్‌పేట కేంద్రంగా నగరంలో పలు రకాల మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద 300 గ్రాముల ఖత్(యెమెన్ డ్రగ్), 30 గ్రాముల ఎండీఎంఎ, 1.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm