హైదరాబాద్ : బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రంగా మారింది. అది తుపాను మారి.. బుధవారం(నవంబర్ 25న) తమిళనాడు, పుదుచ్చేరి తీరాలను దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపానుకు నివర్ అని పేరు పెట్టారు. చెన్నైలోని రోడ్లు నివర్ ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కరైంకల్ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు.. చెంబరంబక్కం వంటి జలాశయ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా.. లోతట్టు ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిపారు అధికారులు.
Mon Jan 19, 2015 06:51 pm