హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలపై టీఆర్ఎస్ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బులిస్తామని సంజయ్ చెబుతుంటే.. కేంద్రం నేరుగా డబ్బులివ్వదని కిషన్‌రెడ్డి అంటున్నారని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కేవలం టీఆర్‌ఎస్‌కే సాధ్యమని అన్నారు. యూపీఏ సర్కార్ ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరు చేస్తే..బీజేపీ వచ్చాక దాన్ని రద్దు చేసి యువత నోట్లో మట్టికొట్టిందన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూపాయి కూడా నల్లధనం బయటికి రాలేదని విమర్శించారు. నల్ల ధనమంతా బీజేపీ నేతల జేబులోకి వెళ్లిందని హరీష్‌రావు ఆరోపించారు.
Mon Jan 19, 2015 06:51 pm