హైదరాబాద్ : పంజాబ్ లో నలుగురు దారుణహత్యకు గురయ్యారు. లూథియానాలోని మయూర్ విహార్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు రాజీవ్ సూద్ భార్య సునీత, కొడుకు అశీష్, కోడలు గరిమతోపాటు అతని 13 ఏండ్ల మనుమడిని దారుణంగా గొంతు కోసి చంపేశారు. మంగళవారం ఉదయం గరిమ తండ్రి తన కూతురును చూసేందుకు వెళ్లగా లోపలి నుంచి గడియవేసి ఉన్నది. ఎంత పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడంతో ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు విరగ్గొట్టి చూడగా నలుగురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. అయితే ఆ ఇంటి యజమాని రాజీవ్ సూద్ జాడ లేదు. దుండగులు కుటుంబసభ్యులను చంపి రాజీవ్‌ను ఎత్తుకెళ్లారా లేదంటే ఏదైనా కారణాలతో రాజీవే కుటుంబసభ్యులను హత్యచేసి పారిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm