హైదరాబాద్ : సంగారెడ్డిజిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నారాయణఖేడ్ మండలం నిజాంపేట్- మునిగేపల్లి క్రాస్ రోడ్ దగ్గర బస్సు, బైక్ ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు కల్హేర్ మండలం నాగ్‌ధర్, రాపర్తి గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm