హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 445.87 పాయింట్లు అంటే 1.01శాతం లాభపడి 44,523.02 వద్ద, నిఫ్టీ 128.70 పాయింట్లు 1.00శాతం ఎగిసి 13,055.20 పాయింట్ల వద్ద ముగిసింది. 1603 షేర్లు లాభాల్లో, 1167 నష్టాల్లోక్లోజ్ అయ్యాయి. 175 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ 44,523 పాయింట్లతో సరికొత్త శిఖరాలను తాకింది. నిఫ్టీ కూడా నేడు మొదటిసారి 13 వేల మార్క్‌ను క్రాస్ చేసింది. నిఫ్టీ బ్యాంకు సూచీ 2 శాతం లాభపడగా, ఆటో, మెటల్, ఫార్మా సూచీలు ఒక శాతం చొప్పున పెరిగాయి.
Mon Jan 19, 2015 06:51 pm