హైదరాబాద్ : తమ ప్రాంతం నుంచి ఎటు వెళ్లలేక సవాళ్లు ఎదుర్కొనే గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన చదువుకున్న మహిళలకు శిక్షణ అందించి వారికి ఉపాధి కల్పించే “సఖీ దృష్టికోణ్”ను నేడు క్యాప్‌జెమిని ఆవిష్కరించింది. పట్టణ ప్రాంతాల్లోని మహిళల మాదిరి అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతున్న గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న మహిళలకు ప్రయోజనం కల్పించేందుకు ఉద్దేశించినది ఈ కార్యక్రమం. మనం పనిచేసే విధానం, సమాచారం అందుకునే తీరు, కనెక్ట్ వంటి విషయాలను డిజిటల్ విప్లవం సమూలంగా మార్చేసింది. ఈ ప్రపంచంలో ఉండేవారి కోసం అది అనేక అవకాశాలు కల్పిస్తోంది. అయితే, ఈ ప్రయోజనాలు చాలా వర్గాలు ముఖ్యంగా మహిళలకు దక్కడం లేదు. వారు డిజిటల్, గ్రామీణ, లింగంపరంగా త్రిముఖ సమస్యలు ఎదుర్కొంటారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ప్రధాన స్రవంతి శ్రామికశక్తిగా మార్చే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమం సఖీ దృష్టికోణ్.
క్యాప్జెమినిలో నమోదైన స్వచ్ఛంద సంస్థలు ఎంపిక చేసిన అభ్యర్థులతో సఖీ దృష్టికోణ్ కార్యక్రమం మొదలవుతుంది. ఇలా ఎంపిక చేసిన అభ్యర్థులకు క్యాప్జెమిని డిజిటల్ అకాడమీ 4 వారాల పాటు ఫౌండేషన్ శిక్షణ, క్యాప్ జెమిని సీఐఎస్ (క్లౌడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్) అకాడమీ ద్వారా 12 వారాల టెక్నికల్ శిక్షణ అందిస్తుంది. ఆ తర్వాత 4 వారాల పాటు శిక్షణ పొందిన అభ్యర్థులను టెక్నికల్ బడ్డీలుగా ప్రతీ అభ్యర్థికి కేటాయించడం జరుగుతుంది. వీరికి అందించే టెక్నికల్ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ పాఠాలు, ఆన్ జాబ్ ట్రెయినింగ్ వారు పూర్తిస్థాయి ఇంజినీర్లుగా ఎదిగేలా సాయపడటంతో పాటు డిజిటల్ ప్రధాన స్రవంతిలో వారు నిలదొక్కుకునేలా చేస్తుంది. శిక్షణ తర్వాత ఎంపిక చేసిన అభ్యర్థులను క్యాప్జెమిని సీఐఎస్ టీమ్ ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. ఈ అభ్యర్థులకు డేటాసెంటర్, క్లౌడ్, సైబర్, కార్య స్థలం లేదా సర్వీస్ డెస్క్ లో పనులు కేటాయించడం జరుగుతుంది. ఉద్యోగంలో భాగంగా క్యాప్జెమిని విధానాలపై సంపూర్ణ అవగాహన పొందేందుకు సంవత్సరకాలం పాటు ఒక మెంటార్ ద్వారా వీరికి సమగ్ర కార్యక్రమం ఉంటుంది. టెక్నికల్ స్ట్రీమ్స్‌లో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయిన గ్రామీణ మహిళలు ఎక్కువ మటుకు ఫ్రెషర్స్ లేదా కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్నవారి కోసం సఖీ దృష్టికోణ్ ద్వారాలు తెరిచి ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా డిసెంబర్ 2020 నాటికి 500 మంది మహిళలను ఉద్యోగాల్లో తీసుకోవాలన్నది క్యాప్‌జెమిని లక్ష్యం. ఇది భారతదేశవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమం, దీర్ఘకాలంలో దీన్ని ఇతర బిజినెస్ యూనిట్లకు కూడా విస్తరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2021లో 15% అభ్యర్థులను తీసుకోవాలని క్యాప్‌జెమిని సీఐఎస్ బిజినెస్ యూనిట్ భావిస్తోంది.
క్యాప్‌జెమిని గురించి
కన్సల్టింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ సేవల్లో ప్రపంచ అగ్రగామి సంస్థ క్యాప్‌జెమిని. ఎదుగుతున్న క్లౌడ్, డిజిటల్, ఫ్లాట్‌ఫామ్స్ రంగాల్లో క్లైంట్ల అవసరాలకు తగినట్టు సృజనాత్మకతను అందించడంలో ఈ గ్రూప్ ముందుస్థానంలో ఉంది. 50 ఏళ్ల బలమైన వారసత్వం, ఈ రంగానికి సంబంధించి నిర్ధిష్టమైన అనుభవంతో వివిధ సంస్థలు తమ వ్యాపార లక్ష్యాలు సాధించేలా స్ట్రాటజీ నుంచి ఆపరేషన్స్ వరకు రకరకాల సేవలను క్యాప్‌జెమిని అందిస్తోంది. బాధ్యతాయుతమైన, ఈ బహుళ సాంస్కృతిక సంస్థలో 265,000 మంది 50 దేశాల్లో పనిచేస్తున్నారు. సుస్థిరమైన, సమిష్టితత్వంతో కూడిన భవిష్యత్ కోసం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మానవశక్తిని వెలికితీసే ఉద్దేశంతో క్యాప్‌జెమిని పనిచేస్తోంది. అల్ట్రాన్‌తో కలిపి 2019లో గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా €17 బిలియన్ల రెవెన్యూ ఆర్జించింది. www.capgemini.com లో మమ్మల్ని సందర్శించండి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Nov,2020 08:12PM