హైదరాబాద్ : బీహార్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ బీహార్ వాసులంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రధాని వెూడీ ఇచ్చిన హామి మేరకు బీహార్ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని అన్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.25గా ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm