హైదరాబాద్ : బస్సుకు విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ సరఫరా కావడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యాత్రికులు కాళేశ్వరంలో పూజలు ముగించుకొని కాటారం వద్ద భోజనం చేసేందుకు రెస్టారెంట్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో వాహనం పార్కింగ్ చేస్తున్న క్రమంలో 11కేవీ కరెంట్ తగిలింది. దీంతో మినీ బస్సంతా కరెంటు సరఫరా కావడంతో అందులో ఉన్న డ్రైవర్ శంకరయ్య, యాత్రికురాలు సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో డ్రైవర్ శంకరయ్య పరిస్థితి విషయంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో మిగతా వారంతా బస్సులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
Mon Jan 19, 2015 06:51 pm