హైదరాబాద్ : రికార్డు స్థాయికి చేరి కొనుగోలుదారులను భయపెట్టిన బంగారం ధర క్రమేపీ దిగి వస్తోంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు మంగళవారం భారీ క్షీణతను నమోదు చేశాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా 1,049 తగ్గింది. చివరకు రూ.48,569 వద్ద 49 వేలకు దిగువన స్థిరపడింది. అంతకుముందు సెషన్‌లో 10 గ్రాముల ధర 49,618 రూపాయల వద్ద ముగిసింది. అలాగే వెండి ధర కూడా కిలోకు 60 వేల దిగువకు చేరడంతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. మంగళవారం కిలోకు రూ.1,588 క్షీణించి రూ.59,301 పలికింది.. కరోనా టీకాలపై ఆశలు, ట్రయల్స్‌లో పురోగతితో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే ఆశలతో బంగారం పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు 1,830 డాలర్లుగా పలకగా, వెండి ధర 23.42 డాలర్ల వద్ద ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm