హైదరాబాద్ : కరోనా మహమ్మారి కారణంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ (71) కన్నుమూశారు. నెల రోజుల కిందట కరోనా బారినపడిన అహ్మద్ పటేల్ కోలుకోలేకపోయారు. గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఈ నెల 15 నుంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అహ్మద్ పటేల్ మృతి విషయాన్ని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా ప్రభావంతో అవయవాలు బాగా దెబ్బతినడమే ఆయన మరణానికి దారితీసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ సీనియర్ నేత మృతితో కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm