హైదరాబాద్ : ఆప్గానిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుళ్లతో ఉలిక్కిపడింది. ఆఫ్గన్ లోని బమియాన్ పట్టణంలో భారీ బాంబు పేలుడు ఘటన సంభవించింది. ఈ పేలుళ్ల ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ పట్టణంలోని మార్కెట్‌లో ఈ పేలుళ్లు జరిగాయని స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. ఈ పేలుళ్లకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు స్పందించలేదు. పర్యటకలు ఎక్కువగా సందర్శించే బనియాన్ లో పేలుళ్లు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm