హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు చిరుత కనిపించినట్లు చెబుతున్నారు. గ్రామాల ప్రజల ఫిర్యాదుతో అటవీ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించారు. బోను ఏర్పాటుచేసి చిరుత కోసం గాలింపు చేపట్టారు. చిరుత ఎప్పుడు ఎవరిపైన దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm