హైదరాబాద్ : కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ మృతికి పార్టీ నేతలు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. కీలక నేతను కోల్పోడంతో పార్టీ నేతలు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పటేల్ మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చాలా విలువైన ఆస్తిని కోల్పోయిందని అన్నారు. అహ్మద్ పటేల్ నెహ్రూ గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడని చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభం లాంటివారని పేర్కొన్నారు. ఎన్నో కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచారని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm