హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలపై రాజకీయ వేడి మొదలైంది. ప్రత్యర్ధులు ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో ప్రచారంలో మునిగిపోయారు. ఈ తరుణంలో గ్రేటర్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. రిజర్వేషన్ రొటేషన్ పద్దతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్ట విరుద్దమని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ పిల్ దాఖలు చేశారు. రిజర్వేషన్ పాలసీకి జీహెచ్ఎంసీ యాక్ట్ సెక్షన్ 52వ విరుద్ధంగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm