హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై తుఫాన్ వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో వాహనంలో 15 మంది ఉండగా సుమారు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వైపు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm