హైదరాబాద్ : నిజాయతీగా పనిచేస్తున్నప్పటికీ తనను ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఏపీ సీఎం జగన్కు లేఖ రాసి ఓ దివ్యాంగురాలైన వాలంటీర్ ఆత్మహత్యకు యత్నించింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ ఘటన జరిగింది. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. వివరాల ప్రకారం.. ఐదో వార్డు సచివాలయం వాలంటీరు మహంకాళి అంకేశ్వరి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించించింది. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్కు తరలించారు.నా ఆత్మహత్యకు అతనే కారణం తాను ఆరో వార్డు రేషన్ డీలరు వేధింపులు తాళలేక చనిపోతున్నట్లు.. నిజాయతీగా పనిచేస్తున్నప్పటికీ అనర్హురాలికి చేయూత పథకం లబ్ధి అందలేదనే కారణాన్ని చూపించి ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని వాలంటీరు వద్ద లభ్యమైన లేఖలో ఆమె పేర్కొంది. తన ఆత్మహత్యకు రేషన్ డీలర్ కారణమని ఆరోపిస్తూ వాలంటీర్లూ క్షమించండి... అమ్మా క్షమించు అని ఆమె లేఖలో రాసింది.
Mon Jan 19, 2015 06:51 pm