హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 243 పాయింట్లు లాభపడి 44,766 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 71 పాయింట్లు మెరుగై 13,126 పాయింట్ల వద్దకు చేరింది. మార్కెట్లకు ప్రధానంగా బలమైన ఎఫ్పీఐ ప్రవాహంతో నవంబర్లో దేశీయ సూచీల్లో ర్యాలీ కొనసాగుతోంది. కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్ల ఫలితాలు కూడా సానుకూలంగా రావటం మార్కెట్లకు కలిసివస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm