హైదరాబాద్ : అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 2వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఒకేరోజు కొవిడ్ వల్ల 2,146 మంది మృతి చెందినట్టు జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ పేర్కొంది. మే నెలలో చివరిసారిగా రెండు వేలకు పైగా మరణాలు నమోదు కాగా.. ఆరు నెలల తర్వాత మంగళవారం మరోసారి 2వేలకు పైగా కరోనా మరణాలు సంభవించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు యూఎస్ వ్యాప్తంగా ఈ వైరస్‌కు బలైనవారి సంఖ్య 2,59,925కు చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm