హైదరాబాద్ : జానీ వాకర్, స్మిర్నాఫ్ మరియు గిన్నిస్‌ను తయారు చేసే ఈ రోజు, జానీ వాకర్, స్మిర్నాఫ్ మరియు గిన్నిస్ తయారీదారుడు డియాజియో, 2030 నాటికి ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపేలా, 25 ధైర్యవంతమైన మరియు ప్రతిష్టాత్మక లక్ష్యాలతో రూపొందించిన ‘‘సొసైటీ 2030: స్పిరిట్ ఆఫ్ ప్రోగ్రెస్’’ పేరిట తన క్రియాశీలక ప్రణాళికను నేడు ప్రకటించింది. ఇది ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే ‘డెకేడ్ ఆఫ్ యాక్షన్’కు అనుగుణంగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ESGప్రగతి సుదీర్ఘ ట్రాక్-రికార్డుకు అనుగుణంగా, డియాజియో తన కార్యాచరణను మూడు ప్రధాన విభాగాలపై కేంద్రీకృతం చేయనుండగా, ఇందులో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో (SDGs) అనుసంధానం చేసందుకు అనువుగా జాగ్రత్తగా ఎంపిక చేశారు: సానుకూల మద్యపానాన్ని ప్రోత్సహించడం; ఛాంపియన్ చేరిక మరియు వైవిధ్యం;మరియు గ్రెయిట్ టూ గ్లాస్ సుస్థిరతకు మార్గదర్శకత్వం ఇందులో ఉన్నాయి.
డియాజియో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ ఆనంద్ క్రిపాలుమాట్లాడుతూ ‘‘పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మరియు పరిశ్రమకు నేతృత్వం వహించేందుకు మా వంతు బాధ్యతను పోషించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. డియాజియో ఇండియా తన ఉత్పాదక విభాగాల్లో, మేము పని చేసే సముదాయాల్లో - సుస్థిరత విభాగంలో గణనీయమైన పురోగతి సాధించింది. రానున్న తదుపరి క్లిష్టమైన దశాబ్దానికి ప్రకటించిన మా ప్రతిష్టాత్మక లక్ష్యాలు భవిష్యత్తు పట్ల ఉన్న మా నిబద్ధతకు అద్దం పడతాయని’’ పేర్కొన్నారు.
గ్లోబల్ ‘సొసైటీ 2030: స్పిరిట్ ఆఫ్ ప్రోగ్రెస్’ ప్రణాళికలోని ముఖ్యాంశాలు:
సానుకూల మద్యపానాన్ని ప్రోత్సహిస్తుంది
· 2030 నాటికి, డియాజియో తన బ్రాండ్ల సహకారంతో ఒక బిలియన్ పైచిలుకు ప్రజలకు పరిమిత మద్య సేవన సందేశాన్ని అందించనుంది.
· మద్యం తాగి వాహనాలను నడిపే వైఖరిని కలిగి ఉన్న అయిదు మిలియన్ల డ్రైవర్లలో పరివర్తన తీసుకు వచ్చేందుకు చర్యలు; మరియు
· ఇప్పుడు ప్రతి ఖండంలోనూ సేవలు అందిస్తున్న డియాజియో అవార్డు గెలుచుకున్న ఆల్కహాల్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ప్రోగ్రాం ‘స్మాష్డ్’ ద్వారా పిన్న వయస్కుల్లో మద్యం అలవాటుతో ఎదురయ్యే ప్రమాదాల గురించి 10 మిలియన్ల పైచిలుకు ప్రజలకు అవగాహన కల్పించనుంది
ఛాంపియన్ చేరిక మరియు వైవిధ్యం
· 2030 నాటికి జాతుల పరంగా, విభిన్న నేపథ్యాలకు చెందిన 45% మంది నాయకులను కలిగి ఉండాలని, అలాగే 50% మంది నాయకులు మహిళలు కావాలని పరిశ్రమ-ప్రముఖ ఆశయాన్ని నెలకొల్పడం ద్వారా డియాజియో తన ఇన్‌క్లూజన్ మరియు వైవిధ్యాలకు బలమైన ట్రాక్ రికార్డ్‌ను రూపొందిస్తోంది
ఇంక్లూజివ్ మరియు అభివృద్ధి చెందుతున్న ఆతిథ్య రంగాన్ని సృష్టించేందుకు డియాజియో 1.7 మిలియన్ల పైచిలుకు వ్యక్తులకు నైపుణ్యాలు మరియు శిక్షణను అందిస్తుంది.
గ్రెయిన్ టూ గ్లాస్ గాజు సుస్థిరతకు మార్గదర్శకత్వం
· తక్కువ- కర్బన ఉద్గారాలను కలిగి ఉన్న భవిష్యత్తును రూపొందించేందుకు డియాజియో కట్టుబడి, తన ప్రత్యక్ష కార్యకలాపాల్లో నికర సున్నా కర్బన ఉద్గారాలను సాధించేందుకు 100% పునరుత్పాదక శక్తిని వినియోగించుకోవడం మరియు పరోక్షంగా 50% కర్బన కార్బన్ ఉద్గారాలను తగ్గించుకునే దిశలో పంపిణీదారులతో కలిసి పనిచేయడం; మరియు
· 2030 నాటికి డియాజియో అది ఉత్పత్తి చేసే ప్రతి పానీయం తయారీకి నేడు వినియోగించుకుంటున్న నీటి కన్నా 30% తక్కువ నీరు తీసుకుంటుందని కచితపరుస్తోంది మరియు మా కీలక వాటర్ స్ట్రెస్డ్ బేసిన్స్ మరియు కమ్యూనిటీలలో నికర సానుకూల నీటి ప్రభావాన్ని సాధించే లక్ష్యాన్ని కలిగి ఉంది; మరియు
· ఇది స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతకు గుర్తింపు కల్పించచడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 150కి పైచిలుకు సముదాయాల్లో నీటి ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురానుంది; మరియు
· భూమిని మరింత సారవంతం చేసేందుకు మరియు జీవవైవిధ్యాన్ని నిర్మించేందుకు వ్యవసాయ పద్ధతులతో 150,000 మంది చిన్న కమతాలు ఉన్న రైతులకు డియాజియో మద్దతుగా నిలువనుంది; మరియు
· 2030 నాటికి వ్యాపారం ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లో 100% రీసైకిల్ కంటెంట్‌ను ఉపయోగిస్తుందని మరియు 100% డియాజియో ప్యాకేజింగ్ విస్తృతంగా పునర్వినియోగానికి ఉపయోగించబడేదని హామీ ఇస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Nov,2020 03:25PM