హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అరాచక శక్తుల కుట్రలపై ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని స్పష్టం చేశారు. సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందే యత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానమని చెప్పారు. సంఘ విద్రోహశక్తులను అణచివేసే విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాల్లో గొడవలు రాజేసి హైదరాబాద్‌కు విస్తరించాలని చూస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రార్థన మందిరాల వద్ద వికృత చేష్టలు చేయాలని కూడా చూస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వాయిదా వేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు వారి అబద్ధపు ప్రచారాన్ని పట్టించుకోలేదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm