హైదరాబాద్ : అర్జెంటీనా సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా ఇక లేరు. తన అపురూప విన్యాసాలతో ఫుట్ బాల్ క్రీడకే వన్నె తెచ్చిన అరుదైన క్రీడాకారుల్లో ఒకరైన మారడోనా గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఇటీవలే మెదడులో రక్తస్రావం కారణంగా చికిత్స పొందిన మారడోనా కొన్ని వారాల కిందట ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. కోలుకుంటున్న దశలో అనూహ్యంగా గుండెపోటుకు గురయ్యారు. మారడోనా ఆటతోనే కాదు మాదకద్రవ్యాలు, ఇతర వివాదాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇటీవలే తన పుట్టినరోజు జరుపుకున్న ఈ ఫుట్ బాల్ లెజెండ్ ఇక లేరని తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 1986లో అర్జెంటీనా వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర మారడోనాదే.
Mon Jan 19, 2015 06:51 pm