హైదరాబాద్ : నివర్ తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలియజేసింది. బుధవారం రాత్రి 11.30 గంటల తర్వాత తీరం దాటినట్టు అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. పుదుచ్చేరికి సమీపంలో అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా పరిణమించింది. తుఫాను తీరం దాటక గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వివరించారు. తుఫాను కారణంగా 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తుఫాను తీరం దాటే సమయంలో వీచిన గాలులకు భారీ వృక్షాలు నెలకొరిగాయి. పంటలకు భారీ నష్టం వాటిల్లింది.
Mon Jan 19, 2015 06:51 pm