హైదరాబాద్ : పండగ సీజన్ లో రద్దీని తట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేకరైళ్లను మరికొంత కాలం పాటు పొడిగించనున్నామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రస్తుతం 14 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండగా, మరో 12 రైళ్లను దసరా - దీపావళి సీజన్ లో నడుపుతున్న రైల్వే శాఖ వాటిని డిసెంబర్ నెలాఖరు వరకూ, అయ్యప్ప భక్తుల శబరిమల యాత్ర కోసం మరో రెండు రైళ్లను సికింద్రాబాద్ - త్రివేండ్రం మధ్య జనవరి 20 వరకూ నడిపిస్తామని వెల్లడించింది.
పొడిగించిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ - విశాఖపట్నం - హైదరాబాద్, సికింద్రా బాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్, లింగంపల్లి - కాకినాడ టౌన్ - లింగంపల్లి, హైదరాబాద్ - న్యూ ఢిల్లీ - హైదరాబాద్, హైదరాబాద్ - ముంబై - హైదరాబాద్, తిరుపతి - నిజామాబాద్ - తిరుపతి, తిరుపతి - విశాఖపట్నం - తిరుపతి రైళ్లను పొడిగించామని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఈ రైళ్లు కొనసాగుతాయని ఓ ప్రకటనలో తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Nov,2020 08:15AM