హైదరాబాద్ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా కేంద్రం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొవిడ్ కొత్త నిబంధనలను విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కంటెయిన్ మెంట్ జోన్ల విషయంలో మరింత కఠినంగా ఉండాలని ఆదేశించింది. జోన్ల పరిధిలో నిత్యావసర వస్తువుల నిమిత్తం వెళ్లే వారికి మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు స్థానిక జిల్లా అధికారులు, పోలీసులు, పురపాలక అధికారులు అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించింది.
కేసుల తీవ్రతను బట్టి, స్థానిక ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించుకోవచ్చని, రాత్రి పూట కర్ఫ్యూ పెట్టుకునే అవకాశం కూడా రాష్ట్రాల పరిధిలోనే నిర్ణయించుకోవచ్చని, కేసులు పెరగకుండా చూసేందుకు ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని వెల్లడించింది. అన్ని కార్యాలయాల్లోనూ ఉద్యోగులు భౌతిక దూరాన్ని పాటిస్తూ విధులు నిర్వహించుకోవచ్చని, కేసుల పాజిటివిటీ రేటు 10 శాతానికి మించి నమోదైతే, కార్యాలయాల సమయాలను మార్చుకుని, షిఫ్ట్ పద్ధతుల్లో విధులకు హాజరు కావచ్చని, ఒకే సమయంలో ఉద్యోగులంతా ఆఫీసుల్లో లేకుండా చూసుకోవాలని హెచ్చరించింది.
ఇక కంటెయిన్ మెంట్ జోన్ల బయట స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాల్స్ తెరచుకోవచ్చని, అయితే, ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా అని నిబంధనలనూ పాటించాలని ఆదేశించింది. బిజినెస్ టూ బిజినెస్ కింద ఎగ్జిబిషన్ హాల్స్ తెరచుకోవచ్చని, మొత్తం హాల్ కెపాసిటీలో గరిష్ఠంగా 50 శాతానికి పరిమితమై వినోద, విద్య, సాంస్కృతిక, మత పరమైన కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని హోమ్ శాఖ వెల్లడించింది. ఈ సంఖ్య ఎట్టి పరిస్థితుల్లోనూ 200కు మించరాదని తేల్చి చెప్పింది. రాష్ట్రాల మధ్య ప్రజలు, సరకు రవాణా తదితరాలపై ఎటువంటి ఆంక్షలూ లేవని, ప్రయాణాలకు విడిగి అనుమతులు అక్కర్లేదని ప్రకటించింది. కరోనా సోకిన వారు, అంతకుముందు ఎవరెవరిని కలిశారన్న విషయాన్ని 72 గంటల్లోగా ట్రేస్ చేయాలని, వారిలోని లక్షణాలను బట్టి క్వారంటైన్ లేదా ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టాలని హోమ్ శాఖ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Nov,2020 08:30AM