హైదరాబాద్ : ఢిల్లీ చలో పిలుపు నేపథ్యంలో దేశ రాజధాని సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులను పోలీసులు సరిహద్దుల్లో నిలిపివేశారు. దీంతో బదర్ పూర్ సరిహద్దుల్లో రైతులు ఆందోళనకు దిగారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళనకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్ బలగాలను పెద్దసంఖ్యలో మోహరించారు. ఢిల్లీ చలో నేపథ్యంలో హర్యానా రాష్ట్రం నుంచి పంజాబ్ కు బస్సుల రాకపోకలను నిలిపివేసారు. హర్యానాలో రైతుల ఆందోళన వల్ల 144 సెక్షన్ విధించారు. రెండు రాష్ట్రాల నుండి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో ర్యాలీగా తరలివచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm