హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 49 మంది అభ్యర్థులు నేరచరిత్ర కలిగిన వారు ఉన్నారు. మొత్తం 150 వార్డుల నుంచి 1122 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 41 డివిజన్లలో నేరచరితులున్నట్లు స్పష్టమవుతోంది. వీరిలో ఆరుగురు మహిళలు. ఈ వివరాలతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్‌జీజీ) సంస్థ సైతం బుధవారం నివేదిక విడుదల చేసింది. మల్కాజిగిరి (140) వార్డులో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నేరచరిత్ర కలిగిన వారే కావడం గమనార్హం. కిందటిసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 72 మంది నేరచరితులు బరిలో నిలవగా.. ఈసారి ఆ సంఖ్య 49గా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm