హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండల పరిధిలో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాను కారణంగా వర్షం కురవడంతో రైతులు రోడ్లపైనే.. ధాన్యం ఆరబెట్టుకోనే దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm