హైదరాబాద్ : దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వేల సంఖ్యలో వాహనదారులు మృత్యువాత పడుతున్నారు. ఈరోజు ఉదయంలో అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ఘటన దిబ్రూగర్ లెప్ట్‌కటాలో చోటుచేసుకుంది. జాతీయ రహదారి 37పై అతివేగంతో ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రొక్లయినర్‌ను తరలిస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అస్సాం మెడికల్ కాలేజీకి తరలిస్తుండగానే చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm