హైదరాబాద్ : ఐపీఎల్ పుణ్యమా అని బెట్టింగ్ మామాలుగా నడవలేదు. బెట్టింగ్ ప్రక్రియలో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేసారు. తాజా కామారెడ్డి జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో జోరుగా నడిచింది. సీఐ జగదీష్ బెట్టింగ్ ను పోత్సాహించి భారీగా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని అరెస్ట్ చేసారు. ఈ వ్యవహారంలో నాలుగు రోజుల నుంచి పరారీలో ఉన్న ఎస్సై గోవిందుని ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. బెట్టింగ్ వ్యవహారంలో డీఎస్పీ లక్ష్మీనారాయణను రెండు రోజులపాటు ఏసీబీ అధికారులు విచారించి ఆయనను వదిలేశారు. ఈ అవినీతి కూపంలో మరికొందరు పోలీసుల పాత్ర ఉన్నట్లుగా ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తుంది. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్, మరో ఎస్ఐ తమ ఫోన్ స్విచాఫ్ చేసుకొని ఏసీబీ విచారణ సహకరించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రెండు రోజుల పాటు సీఐ జగదీష్ ను ఏసీబీ అధికారులు కామారెడ్డిలో విచారించారు. ఆయన ఆస్తులకు సంబంధించి లాకర్ ను బుధవారం నిజామాబాద్ లోని కంఠేశ్వర్ లోగల యాక్సిస్ బ్యాంక్ లాకర్ ను ఏసీబీ అధికారులు తెరువగా అందులో రూ. 34 లక్షల 40 వేల నగదు, రూ. 9 లక్షల 12వేల విలువ గల 182.560 గ్రాముల బంగారు నగలు, 15.7 గ్రాముల వెండి నగలు.. విలువైన ఆస్తి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్ అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm