హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ మళ్లీ కనిపిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలను డిసెంబర్ 31వ తేదీ వరకు రద్దు చేసింది. కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే పరిస్థితులకు అనుగుణంగా విమానాలను నడపనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. కొవిడ్-19కు సంబంధించిన ప్రయాణ, వీసా పరిమితులు పేరుతో తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 26న విడుదల చేసిన సర్క్యులర్‌కు మార్పులు చేస్తున్నామని, అన్ని అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానాలను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నది. డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలు, కార్గో విమానాలకు ఈ నిబంధనలు వర్తించవు.
Mon Jan 19, 2015 06:51 pm