హైదరాబాద్ : నివర్ తుపాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోంమంత్రి సుచరిత సూచించారు. విపత్తు నిర్వహణ, పోలీసు అధికారులను అలెర్ట్ గా ఉండాలని ఆమె ఆదేశించారు. తీరప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు చెప్పారు. ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి ఎప్పటికప్పుడు ఫోన్ లో సుచరిత వివరాలు తెలుసుకుంటున్నారు. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప, గుంటూరు జిల్లాలలో వర్షాలు పడుతున్నాయని తెలిపిన ఆమెకు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు నీట మునిగినట్లు హోంమంత్రికి వివరించారు. వర్షాల అనంతరం పంటల నష్టాన్ని అంచనా వేయాలని సుచరిత సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm