హైదరాబాద్: నగరంలోని నిజాం క్లబ్‌లో జరిగిన 'విశ్వనగరంగా హైదరాబాద్' సదస్సులో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డకా అనేక కార్యక్రమాలు చేపట్టామని అందుకు సంబంధించి 100 గంటలు అయిన చర్చించుకోవాడినికి సరిపోదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ వారికి పాలన చేయరాదు అని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హేళన చేసి మాట్లాడారు కానీ అలాంటి పరిస్థితి నుండి అభివృద్ధి పథంలో నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరంకు ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలు ఉన్నాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ,కమాండ్ కంట్రోల్ హైదరాబాద్ నగరంలో నూతన కట్టడాలు కట్టామని కేటీఆర్ గుర్తుచేశారు. వ్యవసాయ శాఖకు సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు పండించిన పంటకు మద్దతు ధర ఇస్తున్నారని తెలిపిన ఆయన ఇందిరా పార్కులో పరిశ్రమ అధినేతలు ధర్నాచేసేవారు గత ప్రభుత్వాల హయాంలో కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు పరిశ్రమలకు 24 గంటల కరెంట్ సప్లై చేస్తున్నాం. 7000 మెగా వాట్ల డిమాండ్స్ నుండి 16 వేల మెగా వాట్స్ డిమాండ్ కు వచ్చాము. 4000 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాం దేశంలోనే సోలార్ విద్యుత్ ఉత్పత్తి లో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉందని హైదరాబాద్ త్రాగు నీటి సమస్య ఉండేది 96 శాతం సమస్య పరిస్కరం అయిందని రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో సప్లై చేస్తాం కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో దాహార్తిని తీర్చేందుకు గండి పెట్ రిజర్వాయర్ ఒక్కటే ఉండేదని 100 సంవత్సరాలు అయిన ఒక్కటే ఉంది కాని తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేశవపురం రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రోజు నీటి సప్లై చేయడానికి సీఎం కేసీఆర్ ఈ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నారని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరంలో రోడ్ల సమస్య ఉండేది కానీ 6 ఏండ్లలో అనేక రోడ్ల నిర్మాణం చేపట్టాం ఇంకా చేయాల్సింది ఉందని అన్నారు. హైదరాబాద్ లోనే చాలా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వాటి ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేశయని పరిశ్రమ నిర్మాణం కోసం టిఎస్ ఐపాస్ తీసుకువచ్చామని ఈ టీఎస్ ఐపాస్ వలన అనేక పెట్టుబడులు హైదరాబాద్ లో పెట్టారు. గతంలో హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ ఉండేది. నేను నిజాం కాలేజ్ లో చదివిన రోజుల్లో కర్ఫ్యూతో సెలవులు ప్రకటించేవారని పాత రోజులను కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. 6 ఏండ్లలో శాంతి భద్రతల విషయం లో సీఎం కేసీఆర్ అనేక సంస్కరరణలు తెచ్చారు ఒక్క చిన్న ఇష్యు కూడా జరుగలేదు. హైదరాబాద్ లో 5లక్షల సిసి కెమెరాలు ఏర్పాటు చేశాం. చిన్న చిన్న గల్లీ లలో కూడా సిసి కేమెరాలు ఏర్పాటు చేశాం దీనితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగడం లేదని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ నగరంలో పకడ్బందీగా పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగరంలో ప్లై ఓవర్లు ,లింక్ రోడ్లు అండర్ పాస్ రోడ్లు ఏర్పాటు చేశామని కేటీఆర్ అన్నారు.
కిషన్ రెడ్డి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేం ఈ 6 ఏండ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. మరి మీరు ఎం చేశారో చెప్పండి కిషన్ అన్న మేము గడిచిన ఆరు ఏండ్లలో చేసినవి చూపిస్తాం మీరు చూపిస్తారా. గడిచిన ఆరు ఏండ్లలో 2 లక్షల 72 వేల కోట్ల టాక్సీ కేంద్రానికి కట్టాం మీరు ఇచ్చింది ఎంత ఒక్క లక్ష 42 వేలు మాత్రమే ఇచ్చారు.రోహింగ్యాలు ఉన్నారు హైదరాబాద్ లో అంటున్నారు బీజేపీ కేంద్ర మంత్రులు మరి ఆరు ఏండ్లలో ఎటు పోయారు మీరేగా కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆధార్ కార్డ్ ,వీసా పాస్ పోర్ట్ లు మీరే ఇచ్చేది ఎం చేశారు. ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు మానసికంగా కరెక్ట్ లేనట్టు ఉన్నాడు ట్రిపుల్ డ్రైవింగ్ చేయండి చాలన్ మేము కడుతాం అంటున్నాడు. గల్లీ పార్టీ మాది ఢిల్లీ పార్టీ వాళ్ళది ఢిల్లీ టూరిస్ట్ లు వస్తారు పోతారు. హైదరాబాద్ లో వరదలు వస్తే సాయం చేయమంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు సీఎం కేసీఆర్ లేఖ రాశారు ఇప్పటివరకు ఇవ్వలేదు. అదే కర్ణాటక ప్రభుత్వం లేఖ రాస్తే నాలుగు రోజుల్లో ఇచ్చారు హైదరాబాద్ కు ఎందుకు ఇవ్వలేదు ఇండియాలో లేదా హైదరాబాద్ నగరం జరిగేవి లోకల్ ఎన్నికలు కానీ డిల్లీ ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోండి ఇంట్లో ఉండి కేసీఆర్ బాగా చేస్తున్నాడు అనడం కాదు బయటకు వచ్చి ఓటు వేయండి మరోసారి టీఆర్ఎస్ పార్టీ కి సపోర్ట్ చేయండి.