హైదరాబాద్ : ఇటీవల పెరిగిన ఉల్లి ధరలు అలాగే కొనసాగుతున్నాయి. ధరలు పెరిగే అవకాశం ఉండడంతో అటు సామాన్యులు ఇటు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల నుంచి ధరలు అమాంతంగా పెరగడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. రోజు రోజుకూ ధరలు ఆకాశాన్ని అంటుతుండగా ఉల్లి కోయక ముందే ధర వింటేనే కన్నీళ్లు తెప్పిస్తున్నది. ప్రస్తుత మార్కెట్‌లో ఉల్లి ధర రూ.70 నుంచి రూ. 80 మధ్యన కొనసాగుతోంది. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఉల్లి, వెల్లుల్లి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా డిమాండ్‌ను బట్టి మార్కెట్‌లో ఉల్లి దిగుమతి కాకపోవడంతో ఉల్లికి డిమాండ్ పెరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm