చిత్తూరు: జిల్లాలో పలు కాలువలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయమేర్పడింది. ఏర్పేడు మండలంలో పలు గ్రామాల్లో నివాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మండలంలోని నక్కలవంక, సువర్ణముఖి వాగు ప్రమావాహంతో చెన్నంపల్లి గ్రామంలో రాకపోకలు స్తంభించాయి. పాపా నాయుడుపేట వద్ద సువర్ణముఖి పొంగుతోంది. మద్దిలపాలెం, గోవిందపురం వద్ద స్వర్ణముఖి నదిలో మునిగిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. మోదుగులపాలెం కుమ్మరిమిట్ట మార్గంలో కోన కాలువ పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సదాశివకోన రిజర్వాయార్లో నీటిప్రవాహం తిరిగి కలుజు ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఎస్ఆర్ పురం మండలం పాతపాల్యం, పాపిరెడ్డిపల్లి, వాగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాలసముద్రం గ్రామంలో వరి నేలమట్టమైంది. అలాగే మండలంలోని పచ్చికాపలం పరిధిలో టిటిడి కళ్యాణమండపం వద్ద గాలివానకు విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. మాంబేడు గ్రామంలో సుమారు 200 సంవత్సరాల వయస్సున్న చింతచెట్టు నేలకు ఒరిగింది.
తిరుమల రెండోఘాట్ రోడ్డులో తృటిలో పెనుప్రమాదం తప్పింది. 14వ కిలోమీటరు వద్ద బలెరో వాహనంపై పెద్దబండరాయి పడింది. ఈ ప్రమాదంలో వాహనం ముందు టైరు ధ్వంసమైంది. దీంతో యాత్రికులు ఆందోళనకు గుర్యారు. హైదరాబాద్కు చెందన యాత్రికులకు గాయాలయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Nov,2020 04:41PM