హైదరాబాద్ : బిగ్‌బాస్ షో నిర్వాహకులపై నాగార్జున ఓ రేంజ్‌లో ఫైర్ అయినట్టు సమాచారం. ఈ సారి బిగ్‌బాస్ విషయంలో నాగార్జున ఒకింత నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వీకెండ్స్‌లో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఎలిమినేషన్స్‌తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కు సంబంధించిన సమాచారం ముందుగానే లీకైపోతున్నాయి. ఈ లీకులపై నాగార్జున స్టార్ మా నిర్వాహకులపై ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ లీకులు గట్రా ఉంటే ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనని స్టార్ మా వాళ్లకు నాగార్జున ఖరాఖండీగా చెప్పినట్టు సమాచారం. ఏమైనా ఇక ముందైనా.. లీకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్టార్ మా నిర్వాహకులను కోరాడట. మరి నాగార్జున విన్నపాన్ని స్టార్ మా నిర్వాహకులు ఎంత వరకు ఆచరిస్తారనేది చూడాలి.
Mon Jan 19, 2015 06:51 pm